మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్.. మెదక్‌లో బీఆర్ఎస్ ఓటమి
మెదక్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ మెదక్ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: మెదక్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ మెదక్ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థిని పద్మాదేవేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు 9 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. కాగా, ఈ స్థానాన్ని మంత్రి హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుండి వెళ్లిపోయిన మైనంపల్లి హన్మంత్ రావు కొడుకు మైనంపల్లి రోహిత్‌ను ఓడించాలని ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం సంచలనంగా మారింది.