BIG Scam: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న సీఎంఆర్ఎఫ్ స్కామ్..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల స్కామ్‌లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న 28 ప్రైవేటు ఆస్పత్రులపై సీఐడీ ఎఫ్ఐఆర్‌ నమోదు చేసింది.

Update: 2024-08-27 02:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల స్కామ్‌లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న 28 ప్రైవేటు ఆస్పత్రులపై సీఐడీ ఎఫ్ఐఆర్‌ నమోదు చేసింది. బోగస్ బిల్లులు, సంతకాల ఫోర్జరీతో రూ.కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమైనట్లు రెవెన్యూ (సీఎంఆర్ఎఫ్) విభాగం దర్యాప్తులో తేలింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు, కొద్దిమంది ఉద్యోగులు, ప్రయివేటు బ్రోకర్లు (ఏజెంట్లు) కుమ్మక్కై ఈ తతంగానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. చెక్కుల క్లియరెన్స్ సందర్భంగా ఈ వ్యవహారం బయటికి పొక్కడంతో రెవెన్యూ (సీఎంఆర్ఎఫ్) విభాగం సెక్షన్ ఆఫీసర్ డీఎస్ఎన్ మూర్తి ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు ఐపీసీలోని 420, 465, 468, 471 రెడ్ విత్ 511 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఆరు జిల్లాలు.. 28 ఆస్పత్రులు

అనేక ప్రయివేటు ఆస్పత్రుల సీఎంఆర్ఎఫ్ చెక్కుల క్లియరెన్సులను పరిశీలించిన తర్వాత ఆరు జిల్లాల్లోని 28 ఆస్పత్రులు ఈ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. నకిలీ బిల్లులు సమర్పించడంతో పాటు సంతకాలు ఫోర్జరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఖమ్మం జిల్లాలో 10, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మూడు చొప్పున, కరీంనగర్ జిల్లాలో రెండు ఆస్పత్రులపై సీఐడీ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న ప్రభుత్వ సిబ్బంది ఎవరనే అంశంపై విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొద్ది మందిని గుర్తించి వారి సహకారంతో నకిలీ సంతకాలు పెట్టి ప్రయివేటు ఆస్పత్రులకు బిల్లులకు క్లెయిమ్ చేసేందుకు పనిచేసిన పలువురు ఏజెంట్లపైనా సీఐడీ కేసులు నమోదు చేసింది. ఎవరెవరు ఎంత బిల్లు క్లెయిమ్ చేశారన్న జాబితా రూపొందించినా పూర్తి స్థాయి వివరాలు బయటికి రాకుండా సీఐడీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎఫ్ఐఆర్‌ నమోదు చేసింది ఈ ఆస్పత్రులపైనే

ఖమ్మం జిల్లా

శ్రీ శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

మెగాశ్రీ (మేఘశ్రీ) హాస్పిటల్

ఆరెంజ్ హాస్పిటల్

న్యూ అమృత హాస్పిటల్

సుజాత హాస్పిటల్

వైష్ణవి హాస్పిటల్

శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్

గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో

శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ (బైరామల్‌గూడ)

ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (కొత్తపేట)

ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (శరత్ నగర్, రామాంతపూర్)

ఎంఎంఎస్ హాస్పిటల్ (సాగర్ రింగ్ రోడ్డు)

శ్రీ రక్షా హాస్పిటల్ (బీఎన్ రెడ్డి నగర్)

డెల్టా హాస్పిటల్, హస్తినాపురం

హిరణ్య హాస్పిటల్ (మీర్‌పేట్)

శ్రీకృష్ణ హాస్పిటల్ (సైదాబాద్)

జనని హాస్పిటల్ (సైదాబాద్)

అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (ఐఎస్ సదన్ క్రాస్ రోడ్డు)

నల్లగొండ జిల్లా :

అమ్మ హాస్పిటల్ (రైల్వే స్టేషన్ రోడ్డు, నల్లగొండ)

మహేశ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (డాక్టర్స్ కాలనీ, మిర్యాలగూడ)

నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (డాక్టర్స్ కాలనీ, మిర్యాలగూడ)

ఉమ్మడి వరంగల్ జిల్లా

రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ (హన్మకొండ)

సిద్ధార్థ హాస్పిటల్ (మహబూబాబాద్)

శ్రీ సంజీవిని హాస్పిటల్ (మహబూబాబాద్)

కరీంనగర్ జిల్లా :

సప్తగిరి హాస్పిటల్ (జమ్మికుంట)

శ్రీ సాయి మెటెర్నిటీ సర్జికల్ హాస్పిటల్ (పెద్దపల్లి)


Similar News