BIG News: విద్యుత్ కమిషన్ ఫంక్షనింగ్ షురూ.. డాక్యుమెంట్ల స్టడీలో జస్టిస్ మదన్ లోకూర్

ఛత్తీస్‌గఢ్ కరెంటు కొనుగోళ్ల అంశంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాం‌ట్లలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందు‌కు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ పని ముమ్మరమైంది.

Update: 2024-08-17 02:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ కరెంటు కొనుగోళ్ల అంశంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాం‌ట్లలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందు‌కు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ పని ముమ్మరమైంది. గతంలో జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ చైర్మన్‌ (కమిషన ర్)గా నియమించినా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ యన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కొత్త కమిషనర్‌గా నియమితులైన జస్టిస్ మదన్ బీ లోకూర్ గత వారమే బాధ్యతలను స్వీక రించినా గుట్టుచప్పుడు కాకుండా కమిషన్ వ్యవహా రాల్లో తలమునకలయ్యారు. ఛత్తీస్‌గఢ్ కరెంటు కొ నుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మా ణానికి సంబంధించిన డాక్యుమెంట్ల పరిశీలనపై దృష్టి పెట్టారు. కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తర్వా త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సు మొదలు ఈ మూడు అంశా లకు సంబంధించి లోతైన అవగాహన కోసం అధ్య యనం చేస్తున్నారు.

కోర్టు ఆదేశాలతో..

గతంలో కమిషన్‌కు హెడ్‌గా జస్టిస్ నర్సింహారెడ్డి ని యమితులైన తర్వాత ఈ వ్యవహారాలకు సంబం ధించి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తెప్పించుకున్నారు. ఈ రంగంలో నిపుణులైన అధికారులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి కొన్ని వివరాలను, అభిప్రాయాలను సేకరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో పాటు వారి నుంచి కొ న్ని ఆధారాలను స్వీకరించారు. అప్పటి విద్యుత్ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి సహా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ను కూడా విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో బాధ్యతల నుం చి జస్టిస్ నర్సింహారెడ్డి తప్పుకున్నారు అప్పటి వర కు జరిపిన ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించి కొంత రి పోర్టును సిద్ధం చేసినట్లు స్వయంగా జస్టిస్ నర్సింహారెడ్డి ఢిల్లీలో మీడియాకు వివరించారు.

మూడు అంశాలపై అధ్యయనం

ఇప్పుడు ఆయన స్థానంలో జస్టిస్ మదన్ బీ లోకూర్ బాధ్యతలు చేపట్టడంతో జస్టిస్ నర్సింహారెడ్డి చేసిన ఇన్వెస్టిగేషన్ పార్టు, రాసి పెట్టిన కొంత నోట్సును స్టడీ చేస్తున్నట్లు తెలిసింది. వారం రోజులుగా వి ద్యుత్ రంగానికి సంబంధించిన మూడు అంశాల పై అధ్యయనం జరుపుతున్నట్లు కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అధ్యయనం, పరిశీలన పూర్త యిన తర్వాత తదుపరి యాక్షన్ ప్లాన్‌ రూపొందించుకుని దానికి తగినట్లుగా విచారణ ప్రక్రియను స్పీడప్ చేయనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇకపైన ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అప్పటి మంత్రి జగదీశ్‌రెడ్డి, అప్పటి సీఎం కేసీఆర్‌లను ఎంక్వయిరీ చేస్తారా..? విచారణకు హాజరు కావాల్సిందిగా మరోసారి నోటీసులు ఇస్తారా..? ఇలాంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. గతంలో మీడియాతో మాట్లాడినందుకు బాధ్యతల నుంచి జస్టిస్ నర్సింహారెడ్డి తప్పుకోవాల్సి వచ్చినందున ఇప్పుడు జస్టిస్ మదన్ బీ లోకూర్ అదనపు జాగ్రత్తలు తీసుకుం టూ మీడియాకు దూరంగా ఉండాలనే స్టాండ్ తీసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News