BIG New: పీసీసీ చీఫ్‌గా ఆయన పేరు ఫిక్స్..! నేడో, రేపో అధికారిక ప్రకటన

పీసీసీ చీఫ్ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. నేడో, రేపో ఏఐసీసీ ప్రకటించనున్నదని గాంధీభవన్ వర్గాల సమాచారం.

Update: 2024-08-27 01:54 GMT

దిశ, తెలంగాణ బ్యూ‌‌రో: పీసీసీ చీఫ్ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. నేడో, రేపో ఏఐసీసీ ప్రకటించనున్నదని గాంధీభవన్ వర్గాల సమాచారం. పీసీసీ చీఫ్ గా బీసీ నేతనే ఎంపిక చేసినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్ష రేసులో చివరి నిమిషం వరకు కొనసాగిన మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్ లలో ఒక రిని ఫైనల్ చేసి, ఏఐసీసీ తన ఆమోద ము ద్రను వేసింది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌ డ్ కే పీసీసీ పీఠం దక్కిందని ఏఐసీసీ వర్గాలు నుంచి లీకులు వెలువడ్డాయి. దీంతో ఎమ్మె ల్సీ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫాలోవ ర్స్, కేడర్ సంబురాలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ తో పాటు నిజామాబాద్ లోనూ భారీగా ఏర్పాట్లు చేసేందుకు రెడీ అవుతున్నారు. గ్రాండ్ సెలబ్రేషన్స్ కు ప్రిపరేషన్ జరుగుతున్నది. అయితే చివరి ప్రయత్నంగా ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. తనకు పీసీసీ ప్రెసి డెంట్ పోస్టు ఇవ్వాలని హైకమాండ్ పెద్దలను మరోసారి కోరనున్నారు. దీంతో పీసీసీ ప్రకటన మళ్లీ సస్పెన్స్ కు తెర తీసింది.

ముహుర్తం కోసమే జాప్యం...?

అష్టమి పూర్తవగానే పీసీసీ ప్రెసిడెంట్ పోస్టు ప్రకటించాలని రాష్ట్ర పార్టీకి చెందిన కొందరు నేతలు హైకమాండ్ కు రిక్వెస్ట్ చేశారు. దీంతోనే ఎంపిక జరిగినప్పటికీ ప్రకటన పెండింగ్ లో పెట్టారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. సోమవారంతో అష్టమి పూ ర్తయింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నదని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించా రు. దీంతో కొత్త పీసీసీ, కార్యవర్గంతోనే కాం గ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగంలోకి దిగనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పవర్ లో ఉన్న నేపథ్యంలో మెజార్టీ స్థానాల్లో తామే గెలుస్తామని పార్టీ నేతలు అభిప్రాయాన్ని వ్య క్తం చేస్తున్నారు.

చివరి ప్రయత్నాలు ఫలితమిస్తాయా..?

పీసీసీ పదవి కోసం మధుయాష్కీ గౌడ్ కూడా చివరి ప్రయత్నం కింద గట్టిగానే ట్రై చేస్తున్నా రు. ఆయన గతంలో ఎంపీగా పనిచేసిన అ నుభవం, ఏఐసీసీ, సోనియా గాంధీ ఫ్యా మిలీతో మంచి రిలేషన్ ఉండటంతో చివరి ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పు డు పార్టీ నేతల్లోనూ ఉత్కంఠగా మారింది. ఇక ఈ పోస్టు కోసం ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరామ్ నాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, అడ్లూరి ల క్ష్మణ్ పోటీ పడ్డారు. కానీ ఫైనల్ లిస్టులో గౌ డ్ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కు మార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్ పేర్లను ఎం పిక చేశారు. వివిధ స్థాయిల డిస్కషన్స్ అనం తరం మహేష్ కుమార్ గౌడ్ ను ఫైనల్ చేసిన ట్లు ఏఐసీసీ నేతలు వెల్లడిస్తున్నారు. అయితే పీసీసీ ఎంపికలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మంత్రివర్గ విస్తరణ తర్వాతే పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుల నియామకం ఉంటుందని నేతలు చెబుతున్నారు.


Similar News