BIG BREAKING: సినిమా లవర్స్‌కి బిగ్ షాక్.. పది రోజుల పాటు మూతపడనున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినూత్న పరిణామం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినూత్న పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం సినిమాల విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం పెనుభారంగా మారడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నుంచి పది రోజు పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మల్టీఫ్లెక్స్‌ల రాకతో కుదేలైన సింగల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు ఈ సమస్య శరాఘాతంలా తగినట్లైంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద హీరోలా సినిమాలు అన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. దీంతో సినిమాల విడుదల కూడా కాస్త ఆలస్యం అవుతోంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎన్నికల హాడావుడి ఉండటంతో సింగిల్ స్క్రీన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అదేవిధంగా చాలా మల్టీఫ్లెక్స్‌లలో సినిమాల స్క్రీనింగ్‌లతో పాటు విశాలమైన పార్కింగ్, షాపింగ్ సదుపాయం, చిన్నారులకు గేమింగ్ సదుపాయాలు ఫ్రీగా కల్పిస్తున్నారు. దీంతో సినిమా లవర్స్ అంతా.. మల్టీఫ్లెక్స్‌లకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణాలమాల నేపథ్యంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు సందడి వెలవెలబోతున్నాయి. దీంతో యాజమాన్యాలు ఈ శుక్రవారం నుంచి 10 రోజుల పాటు థియేటర్ల మూసివేతకు పిలుపునిచ్చాయి.