Big Alert: నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల వారికి ఎల్లో అలెర్ట్

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-25 02:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో కాస్త తక్కువగా ఉన్నా.. తెలంగాణలో మాత్రం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నీరంతా రోడ్లపై చేరడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భారీ ట్రాఫిక్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ(IMD) తెలిపింది. తాజా అలెర్ట్ ప్రకారం.. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణ పేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలకు తోడు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉండటంతో జనం ఎవరూ బయట తిరగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాన పడేటప్పుడు ఇంట్లోనే ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు.


Similar News