తెలంగాణ మహిళలకు BIG అలర్ట్.. బస్సుల్లో ఫ్రీ జర్నీ స్టార్ట్
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ స్కీమ్‌ను ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులు, ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాగా, సిటీ ఆర్టినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలలో ఒకటి. దీనితో పాటు ఇవాళ సోనియా పుట్టినరోజు సందర్భంగా మరో పథకాన్ని కూడా సీఎం రేవంత్ ప్రారంభించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచారు. ఇదిలా ఉండగా.. మహాలక్ష్మీ స్కీమ్ ప్రారంభం సందర్భంగా ప్రముఖ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌ను సీఎం రేవంత్ సన్మానించారు. అనంతరం నిఖత్ జరీన్‌కు రెండు కోట్ల ఆర్థిక సాయం చేశారు.
Read More: సోనియా బర్త్ డే.. రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి స్పెషల్ గిఫ్ట్!