Bhadrakali Temple:భద్రకాళీ టెంపుల్‌కు ‘భోగ్’ సర్టిఫికెట్
వరంగల్ లోని భద్రకాళీ దేవస్థానం, హైదరాబాద్‌లోని శ్రీజయలక్ష్మి మాతా యోగా సెంటర్ ట్రస్ట్‌కు భోగ్(బ్లిస్ పుల్ అండ్ హైజీనిక్ ఆఫరింగ్ టు గుడ్) సర్టిఫికెట్లు వచ్చాయని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ప్రకటించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ లోని భద్రకాళీ దేవస్థానం, హైదరాబాద్‌లోని శ్రీజయలక్ష్మి మాతా యోగా సెంటర్ ట్రస్ట్‌కు భోగ్(బ్లిస్ పుల్ అండ్ హైజీనిక్ ఆఫరింగ్ టు గుడ్) సర్టిఫికెట్లు వచ్చాయని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఈ మేరకు ఆ దేవ స్థాన అధికారులకు మంత్రి భోగ్ సర్టిఫికేషన్ పత్రాలను అందజేశారు. హైజీనిక్ కండీషన్లో ఫుడ్ తయారు చేస్తూ, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించే దేవస్థానాలు, మందిరాలకు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి భోగ్ సర్టిఫికెట్ ఇస్తారని వెల్లడించారు. భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆలయాల ప్రసాదం తయారీ కేంద్రాలను పలుమార్లు పరిశీలించిన అనంతరం, అన్ని రకాల నిబంధనలు పాటిస్తున్నట్టు నిర్ధారించుకుని ఈ సర్టిఫికెట్లను అందజేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో యాదగిరి గుట్ట లక్ష్మినర్సింహ స్వామి టెంపుల్, సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ సహా సుమారు పది ఆలయాలు, ధ్యాన మందిరాలకు భోగ్ సర్టిఫికేషన్ ఉన్నట్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దామోదర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఎఫ్ఎస్ ఎస్ ఏఐ(పుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ఇండియా) సర్టిఫికెట్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశంలో ఎలాంటి రాజీ ఉండొద్దన్నారు. ఫుడ్ సేఫ్టీ నియమాలు అనుసరిస్తూ, సరియైన పద్ధతిలో బిజినెస్ చేసుకునే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ఫుడ్‌తో పాటు, ఫుడ్ తయారు చేసే ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్ట్రీట్ వెండర్స్‌కు సూచించారు. ఫుడ్ బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న అవగాహన, ట్రైనింగ్ సదస్సులలో పాల్గొనాలని మంత్రి సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎస్ ఎస్ ఎస్ ఏఐ లైసెన్స్ తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ బిర్యానీకి విశ్వవ్యాప్తంగా మంచి పేరు ఉన్నదని, ఆ పేరును నిలబెట్టేలా రాష్ట్రంలో ఫుడ్ ఇండస్ట్రీ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మంచిగా బిజినెస్ చేసుకునే వారికి అండగా ఉంటూనే, తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టి బోమని మంత్రి హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మాత్రమే కాదని, హాస్టళ్లు, హాస్పిటల్స్, వర్క్‌ప్లేస్‌లో ఉండే క్యాంటీన్లు కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో పిల్లలకు మంచి భోజనం పెట్టనివారిని కూడా తప్పకుండా శిక్షిస్తాం అని మంత్రి తెలిపారు. ప్రతి హోటల్‌ను, రెస్టారెంట్‌ను, స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్స్‌ను, హాస్టల్స్, హాస్పిటల్స్, ఆఫీసులలో ఉండే క్యాంటీన్లను ఫుడ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు ఉంటాయన్నారు.
కలెక్టరేట్లో ఫిర్యాదు కేంద్రాలు..
గత పదేండ్లలో పెరిగిన హోటళ్ల సంఖ్య, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ విభాగం బలోపేతం కాలేదని మంత్రి తెలిపారు. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. హోటళ్లు, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచబోతున్నామన్నారు. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నామని, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో కొత్తగా మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇవి కాకుండా కొత్తగా 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నామన్నారు. ఇప్పటికే వాహనాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామని ఆయన వెల్లడించారు. సంవత్సరానికి కనీసం 24 వేల ఫుడ్ శాంపిల్స్ టెస్ట్ చేసేలా ల్యాబులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఫుడ్ సేఫ్టీ కి సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఉచితంగా ట్రైనింగ్, హైజీన్ కిట్లు..
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెల రోజుల్లో 3774 హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఎఫ్ ఎస్ ఎస్ ఏఏఐ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లు నమోదు చేశామన్నారు. జీహెచ్ఎంసీ, జిల్లాల్లో సదస్సులు నిర్వహించి, ఫుడ్ సేఫ్టీపై అవగాహన తో పాటు ట్రైనింగ్ ఇస్తున్నామని ఆయన తెలిపారు.మహబూబ్‌నగర్, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో సదస్సులు నిర్వహించి 1500 మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, హోటల్ వర్కర్స్, ఓనర్స్కు అవగాహన కల్పించామన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ సెషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే ఒకట్రెండు నెలల్లో 3 వేల మందికి అవేర్నెస్ కల్పించేందుకు 60 సెషన్స్ ప్లాన్ చేశామని తెలిపారు.