ప్రజలు బండ కేసి కొట్టినా BRS బుద్ధి రాలేదు: భవానీ రెడ్డి ఫైర్

బండకేసి కొట్టినా, బీఆర్ఎస్‌కు బుద్ధి రాలేదని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ భవాని రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బెయిల్ రాలేదని

Update: 2024-07-02 17:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బండకేసి కొట్టినా, బీఆర్ఎస్‌కు బుద్ధి రాలేదని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ భవాని రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బెయిల్ రాలేదని, కేసీఆర్, కవిత ఆందోళనలో ఉన్నారన్నారు. లిక్కర్ కేసులో ఏం జరుగుతుందో తెలియక కేసీఆర్ అండ్ టీమ్ టెన్షన్ పడుతుందన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులకు నాంది పలికింది మొదట బీఆర్ఎస్సేనని చెప్పారు. ఇప్పుడు నీతి కబుర్లు చెబితే ఎవరూ నమ్మరని వెల్లడించారు. ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్రప్రజలకు స్పష్టంగా తెలుసునని స్పష్టంచేశారు. ఇక విద్యార్ధులు, నిరుద్యోగులను మాజీ మంత్రి హరీష్​రావు రెచ్చకొడుతున్నారని, వాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ముందుకు వెళ్తుందన్నారు.

అనవసరంగా టైం వెస్ట్ చేసుకోకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని నిరుద్యోగుల విజ్ఞప్తి చేస్తున్నాని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల్లోనే 30 వేల ఉద్యోగాల ప్రాసెస్ పూర్తి చేసి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ నాయకుడు కేఎస్ వి చారి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల ట్రోల్ బాధాకరమన్నారు. మతం పేరుతో బీజేపీ దేశాన్ని ఏలుతుందన్నారు. టీపీసీసీ స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ మాట్లాడుతూ.. నిరుద్యోగుల పేరుతో బీజేపీ, బీఆరెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన నడుస్తుందన్నారు. పది ఏండ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదని, ఈ సమయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు..? చర్చకు సిద్ధమా..? అంటూ బీఆర్ఎస్‌కు సవాల్ విసిరారు.

Similar News