Bhatti Vikramarka : సంపదను సృష్టిస్తాం.. ఆ సంపదను ప్రజల కోసం ఖర్చు చేస్తాం : భట్టి విక్రమార్క

ఇందిరమ్మ ప్రభుత్వానికి సంపదను సృష్టించడం తెలుసు.. ఆ సంపదను ప్రజల కోసం ఖర్చు చేయడం తెలుసు అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-03 12:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ ప్రభుత్వానికి సంపదను సృష్టించడం తెలుసు.. ఆ సంపదను ప్రజల కోసం ఖర్చు చేయడం తెలుసు అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు సూర్యాపేట(Suryapeta) జిల్లాలోని గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎలాంటి కుల, మత తేడాలు లేకుండా విద్యార్థులు అందరూ ఒకే చోట చదువు అభ్యసించేందుకు ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపిస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల(Young India Residential Schools)ల్లో ప్రపంచస్థాయి వసతులు, విద్యా ప్రమాణాలు ఉంటాయన్నారు. అన్ని రకాల హాస్టల్ విద్యార్థులకు భారీగా డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమే అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వానికి సంపద సృష్టించడం.. దానిని ప్రజల కోసం ఖర్చు చేయడం తెలుసు అన్నారు. విద్య, వైద్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని భట్టి పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సన్నవడ్లు పండించే రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్న ప్రభుత్వం తమదే అని తెలిపారు. సంక్రాంతి తర్వాత నుంచి అర్హులైన వారందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు.

Tags:    

Similar News