హైకోర్ట్‌లో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్..

వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు గురువారం హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

Update: 2023-04-20 06:38 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు గురువారం హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని భాస్కర్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. వైద్య సహాయం అవసరం కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. సీబీఐ విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి చెప్పిన మాటల నేపథ్యంలో సీబీఐ అధికారులు తనను అరెస్ట్ చేశారని ఉదయ్ కుమార్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News