బైంసా టు గాంధీ భవన్ కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర
వచ్చే ఎన్నికల కోసం పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. అందులో భాగంగానే ‘తెలంగాణ పోరు’ పేరుతో కాంగ్రెస్ మరో యాత్ర చేపట్టేందుకు రెడీ అయింది.
దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల కోసం పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. అందులో భాగంగానే ‘తెలంగాణ పోరు’ పేరుతో కాంగ్రెస్ మరో యాత్ర చేపట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ పేరిట ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్జిల్లాలను అనుసంధానిస్తూ పాదయాత్ర కొనసాగుతున్నది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో మార్చి 3 నుంచి తెలంగాణ పోరు యాత్రను భైంసా నుంచి హైదరాబాద్ లోని గాంధీ భవన్ వరకు నిర్వహించనున్నారు. అంతకు ముందు బాసరలో పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీపీసీసీ నిర్ణయం తీసుకున్నది.
ఈ యాత్రలో రాష్ట్ర ముఖ్య నాయకులంతా పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నది. ప్రతి నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాల్లో కనీసం రెండు రోజుల పాటు యాత్ర చేయాలని నేతల అభిప్రాయం. ఈ యాత్రకు పార్టీ హైకమాండ్నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ రావడంతో నేతలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ఆధ్వర్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. యాత్ర హైదరాబాద్ లోని గాంధీ భవన్లో ముగుస్తున్నందన ఆ రోజు ఢిల్లీ నుంచి ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
ప్రత్యేక భేటీ
ప్రస్తుతం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న హాథ్ సే హాథ్ పాదయాత్రలో సీనియర్లు పాల్గొనడం లేదు. కొందరు పాల్గొన్నప్పటికీ అంతర్గతంగా అసంతృప్తితోనే ఉన్నట్లు ఆఫ్ ది రికార్డుగా పలువురు నేతలు చెబుతున్నారు. పార్టీ బలోపేతం కోసం నేతలంతా కలిసి నడవాలని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ థాక్రే నొక్కి చెప్పడంతో సీనియర్లంతా ఈ యాత్రలో పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు గాంధీభవన్వర్గాలు చెబుతున్నాయి.
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్మహేశ్వర్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్రాజనర్సింహా ఆధ్వర్యంలో ఈ యాత్ర ప్రారంభం కానున్నది. ఇప్పటికే యాత్రలో పాల్గొనే లీడర్లు ప్రత్యేకంగా భేటీ కూడా అయినట్టు సమాచారం. హాథ్ సే హాథ్ యాత్రను 60 రోజుల పాటు నిర్వహించాల్సి ఉన్నందున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ యాత్రలో పాల్గొనే చాన్స్ తక్కువేనని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
హాథ్ సే హాథ్ యాత్రకు కంటిన్యూగా..
యాత్ర విషయంపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్మహేశ్వర్రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ ఫుల్గా కొనసాగుతున్నదని, దానికి కంటిన్యూగానే తెలంగాణ పోరు యాత్రను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. తొలి విడత 10 రోజుల పాటు నిర్వహించి, ఆ తర్వాత అన్ని నియోజకవర్గాలు టచ్అయ్యేలా యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రలతో పార్టీలో నూతనోత్సహం వస్తుందన్నారు. కార్యకర్తల్లో మనోధైర్యం పెరిగిందని, అతి త్వరలోనే కాంగ్రెస్అధికారంలోకి రాబోతున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పోరు యాత్రకు నేతలంతా సహకరించాలని ఆయన కోరారు.