కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన MLA
భద్రాచలం(Bhadrachalam) కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(MLA Tellam Venkata Rao) డాక్డర్ అవతారం ఎత్తారు.
దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలం(Bhadrachalam) కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(MLA Tellam Venkata Rao) డాక్డర్ అవతారం ఎత్తారు. గుండెపోటు(Heart Attack)తో పడిపోయిన కాంగ్రెస్ నేతకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో పాటు ఎమ్మెల్యే వెంకట్రావు భద్రాచలంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెంట ఉన్న వారిలో కాంగ్రెస్ నేత సుధాకర్ అనే వ్యక్తికి గుండెపోటు వచ్చి కుప్పకూలారు. వెంటనే అతన్ని తెల్లం వెంకట్రావు గమనించి సీపీఆర్ చేశారు. స్పృహ వచ్చిన అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, రాజకీయాల్లోకి రాకముందు వరకూ తెల్లం వెంకట్రావు వైద్యుడిగా పనిచేసిన విషయం తెలిసిందే.