గ్రూప్ -1 రిజల్ట్స్‌పై అస్యత ఆరోపణలు.. మాజీ ఎమ్మెల్సీ తీవ్ర ఆగ్రహం
గ్రూప్-1 రిజల్ట్స్‌పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యమని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు...

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 రిజల్ట్స్‌పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై, గ్రూప్ 4 ఉద్యోగిని అయినా తన కోడలు రోజా బాయ్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యమని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు నాయక్ మంగళవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. రోజా బాయ్ టీజీపీఎస్సీ గ్రూప్-1లో మహిళల విభాగంలో మొదటి ర్యాంక్ సాధించదని చెప్పడం అబద్దమని తెలిపారు. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్‌లో ఆమె టాపర్ అని చెప్పడం కూడా నిజం కాదని తెలిపారు. ఆమె గ్రూప్ 1 ప్రిలిమ్స్ , గ్రూప్ -2, 3 మంచి ర్యాంక్ మాత్రమే సాధించిదని పేర్కోన్నారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌పై ప్రస్తుతం తన కోడలిపై కౌశిక్‌రెడ్డి విషంకక్కుతున్నారని విమర్శించారు. కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు డ్రామాలు చేస్తున్నారని రాములు నాయక్‌తో పాటు రాష్ర్ట గ్రంధాలయ ఛైర్మన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్ , ట్రైకార్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.