గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా గ్రాండ్ టెస్టులు.. ఎక్కడంటే..?

రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఉచితంగా గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తామని తెలంగాణ బీసీ సర్కిల్ అధికారులు స్పష్టంచేశారు.

Update: 2024-06-23 17:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఉచితంగా గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తామని తెలంగాణ బీసీ సర్కిల్ అధికారులు స్పష్టంచేశారు. ఈ మేరకు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జూలైలో ప్రతివారంలో రెండు రోజులు గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో మొదటి గ్రాండ్‌ టెస్ట్‌, జూలై 15, 16 తేదీల్లో రెండో గ్రాండ్‌ టెస్ట్‌, 22, 23 తేదీల్లో మూడో గ్రాండ్‌ టెస్ట్‌, 30, 31 తేదీల్లో నాలుగో గ్రాండ్‌ టెస్టులు ఉండనున్నాయి.

కాగా ప్రతి పరీక్షను ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా టీజీపీఎస్సీ 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ ఏడాది ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరుగనుంది.


Similar News