నేపాల్‌ దేశంలో ఘనంగా ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగ

Update: 2024-10-02 13:28 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పండుగ ఆయన బతుకమ్మ విదేశాల్లోనూ అంగరంగ వైభవంగా జరుగుతుంది. బుధవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రంతో పాటు.. అన్ని దేశాల్లో తెలుగువారి ఆధ్వర్యంలో (ఎంగిలి పువ్వు) పండుగ నిర్వహించారు. ఈ క్రమంలోనే నేపాల్ దేశంలోని ఖాట్మండులో ఉన్న గృహేశ్వరీ శక్తి పీఠం వద్ద బుధవారం బతుకమ్మ పండుగ (ఎంగిలి పువ్వు) నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆట పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పాటించి తెలంగాణ పండుగను అక్కడి వారికి పరిచయం చేయడం విశేషం గా నిలిచింది. నేపాల్ లో వైభవంగా జరిగిన ఈ బతుకమ్మ పండుగ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలానికి చెందిన మహిళలు పాల్గొన్నారు.


Similar News