Bank Holidays: వచ్చే నెలలో బ్యాంక్‌లకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులంటే?

సెప్టెంబర్ నెల మరో మూడు రోజులలో ముగియబోతుంది. అక్టోబర్ నెల వచ్చేస్తోంది. ఇక పండుగ సీజన్‌లో అక్టోబర్ నెల చాలా కీలకం అనే చెప్పవచ్చు.

Update: 2024-09-27 05:29 GMT

దిశ,వెబ్‌డెస్క్:సెప్టెంబర్ నెల మరో మూడు రోజులలో ముగియబోతుంది. అక్టోబర్ నెల వచ్చేస్తోంది. ఇక పండుగ సీజన్‌లో అక్టోబర్ నెల చాలా కీలకం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలలో అధిక సంఖ్యలో పండుగలు ఉన్నాయి. అంతేకాదు ఈ నెలలోనే దసరా పండుగ కూడా వచ్చింది. ఇక సెలవుల జాతరేనని చెప్పవచ్చు. పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు సెలవులే సెలవులు. ఈ నెలలో అధిక సంఖ్యలో హాలిడేస్ ఉండటంతో టూర్ ప్లానింగ్ చేసే పనిలో అందరూ బిజీ బిజీగా ఉంటారనడంలో సందేహం లేదు. కొందరేమో సొంత గ్రామాలకు వెళ్లాలని ప్లానింగ్ వేసుకుంటే మరికొందరేమో విహార యాత్రలకు వెళ్లాలని ప్లానింగ్స్ వేసుకుంటారు. ఈ క్రమంలో బ్యాంకులకు అక్టోబర్ నెలలో సెలవులు ఎన్ని రోజులు వచ్చాయో తెలిస్తే షాకవ్వాల్సిందే. దేశవ్యాప్తంగా వచ్చే నెల బ్యాంకు సెలవుల వివరాలు ఈ క్రింద పేర్కొనడం జరిగింది.

అక్టోబర్ నెల బ్యాంకు సెలవుల వివరాలు..

అక్టోబర్ 2 వ తేదీ మహాత్మా గాంధీ జయంతి, 3న దసరా ప్రారంభం, 6న ఆదివారం, 10న మహా సప్తమి, 11న మహా నవమి, 12న విజయదశమి, 13న ఆదివారం, 17న మహర్షి వాల్మీకి జయంతి, 20న ఆదివారం, 26న బ్యాంకుల మూసివేత, 27న ఆదివారం, 29న దీపావళి, 30న ఐచ్చిక సెలవు దినం, 31న నరక చతుర్దశి. ఈ ప్రకటనను బట్టి దేశ వ్యాప్తంగా 14 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. కానీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మాత్రం 7 రోజుల సెలవు దినాలను బ్యాంకులు ప్రకటించాయి.

ఏపీ, తెలంగాణలో బ్యాంకు సెలవుల వివరాలు..

అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ జయంతి

అక్టోబర్ 10 : మహా సప్తమి

అక్టోబర్ 11 : మహా అష్టమి

అక్టోబర్ 12 : రెండో శనివారం, మహా నవమి, విజయదశమి

అక్టోబర్ 13 : ఆదివారం

అక్టోబర్ 26 : నాలుగో శనివారం

అక్టోబర్ 27 : ఆదివారం


Similar News