ముగిసిన బండి సంజయ్ మూడో ఫేజ్ ప్రజాసంగ్రామ యాత్ర

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది.

Update: 2022-08-27 11:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. 5 జిల్లాలు 11 నియోజకకవర్గాల్లో కొనసాగిన మూడో ఫేజ్ పాదయత్రలో బండి సంజయ్ 300 కిలో మీటర్లు నడిచారు. జనగామ జిల్లా పంనూరు వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజాసంగ్రామ యాత్ర ఆగిన చోట నుంచే తిరిగి మొదలైంది. తీవ్ర ఉద్రిక్తలు, నిర్భంధాలు, అరెస్టులు, ఆంక్షల మధ్య కొనసాగిన ఈ పాదయత్ర చివరి రోజు బండి సంజయ్ 14 కిలోమీటర్లు నడిచారు. ఈ యాత్ర ముగింపు సభ మరికాసేట్లో హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ సభకు భారీ ఎత్తున జన సమీకరణకు బీజేపీ ప్లాన్ చేసింది. సభకు హాజరయ్యేందుకు జేపీ నడ్డా ఇప్పటికే వరంగల్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం బండి సంజయ్‌తో కలిసి ఆయన వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

Also Read : హన్మకొండ సభలో బండి సంజయ్ సంచలన ప్రకటన 

Also Read : వరంగల్‌ వేదికగా కేసీఆర్‌ అవినీతిపై గళమెత్తిన జేపీ నడ్డా


Similar News