కేసీఆర్‌తో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-21 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అతి త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే బీజేపీలో విలీనం అంటూ గేమ్స్ ఆడుతున్నారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామినేషన్ వేయకపోవడానికి రీజన్ కూడా అదే అన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత కేసును అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఇటీవలే పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో భేటీ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అభిషేక్ మను సింఘ్వీ ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల ఉమ్మడి అభ్యర్థి అని ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ విలీనం ఇష్యూ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సచివాలయం ఎదుట విగ్రహా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సచివాలయం ఎదుట వాజ్‌పేయి విగ్రహం పెట్టాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. హైడ్రాతో విధ్వంసం సృష్టిస్తోన్న అధికారులు పెద్ద పెద్ద వ్యక్తుల వద్దకు వెళ్లడం లేదని.. అమాయక పేదల వద్దకు వెళ్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర, హరియాణ ఎన్నికల డబ్బుల కోసమే ఈ కూల్చివేతలు చేపట్టారని అన్నారు.

Tags:    

Similar News