Bandi Sanjay: తెలంగాణ సర్కార్‌కు బండి సంజయ్ మాస్ వార్నింగ్

తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2023-06-30 13:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధర్మపురిలో ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో తానే స్వయంగా రేపు ధర్మపురి వస్తానని బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తర్వాత జరుగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

Also Read..

రాజాసింగ్‌కు విజయశాంతి సపోర్ట్.. ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై ఆసక్తికర ట్వీట్..!  

Tags:    

Similar News