ట్విట్టర్ టిల్లును ఉరికించి కొడతాం: బండి సంజయ్
టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో తనపై అనవసర ఆరోపణలు చేశారంటూ మంత్రి కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసులపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో తనపై అనవసర ఆరోపణలు చేశారంటూ మంత్రి కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసులపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరువు ఉన్నోడు పరువునష్టం దావా వేయాలని, పరువు లేనోడే వేస్తే ఉపయోగం ఏంటని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని, అప్పుడు అక్రమాలు అన్నీ వెలికి తీసి ట్విట్టర్ టిల్లును ఉరికించి కొడతామని హెచ్చరించారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడా, కుటుంబమంతా కలిసి అడ్డంగా దోచుకుతింటున్నారని మండిపడ్డారు.