లాస్య నందిత మృతిపై సమగ్ర విచారణ జరపాలి: బండి సంజయ్
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఓఆర్ఆర్‌పై కారు అదుపుతప్పి టిప్పర్‌ను ఢీకొట్టంతో తీవ్ర గాయాలపాలైన ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు.
దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఓఆర్ఆర్‌పై కారు అదుపుతప్పి టిప్పర్‌ను ఢీకొట్టంతో తీవ్ర గాయాలపాలైన ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు. తాజాగా.. ఎమ్మెల్యే మృతిపై బండి సంజయ్ సంతాపం తెలిపారు. లాస్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాస్య నందిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆమె మరణంపై కుటుంబ సభ్యులు, ప్రజల అనుమానాన్ని నివృత్తి చేయాలని కోరారు. పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. కాగా, అంతకుముందు సంగారెడ్డి ఎస్పీ సంజీవ రావు మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే మృతిపై వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. తలకు బలమైన గాయం, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల లాస్య నందిత చనిపోయినట్లు పోస్టుమార్టం చేసిన డాక్టర్లు పేర్కొన్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక తమ వద్దకు వచ్చేందుకు సమయం పడుతుందన్నారు.