చాలా కసితో ఉన్నా.. నేనేంటో చూపిస్తా: బండి సంజయ్ హాట్ కామెంట్స్
కరీంనగర్ పార్లమెంట్‌ను ఐదేళ్లు వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ పార్లమెంట్‌ను ఐదేళ్లు వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, అన్ని పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధిలో తన మార్క్ ఎంటో చూపెడుతానని చెప్పారు. చాలా కసితో ఉన్నాను.. ప్లాన్‌తో ఉన్నాను.. ఇది పేరు కోసం, గుర్తింపు కోసం కాదన్నారు. రాబోయే రోజుల్లో అందరికీ తప్పకుండా సహకరిస్తానని, ప్లాన్ తయారు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్‌గా ఒక్క పైసా కూడా ఇయ్యరాదని, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిందని, నిధుల కొరత ఉన్నదని విషయాన్ని గుర్తు చేశారు.
కరీంనగర్ అభివృద్ధి విషయంలో ఈ సారి జనరల్ బాడి మీటింగ్‌లో ఒక మంచి చర్చ జరపాలని, ప్లాన్ తయారు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ చేసే బాధ్యత తనదన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్ అందరినీ కలుస్తానని మాట ఇచ్చారు. కరీంగనర్ కార్పొరేషన్ ప్లాన్ తనకు ఇవ్వాలని, ప్లాన్ ప్రకారం నిధులు తీసుకోచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. నేను మీ మనిషిని.. అన్ని పార్టీలను సమానంగా చూడాల్సిన బాధ్యత నాపై ఉంది.. అని చెప్పారు.