Bandi Sanjay: తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు అదే గతి పట్టబోతోంది.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్
మహారాష్ట్ర (Maharashtra)లో ఇండియా కూటమి (India Alliance)కి పట్టిన గతే తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లో ఇండియా కూటమి (India Alliance)కి పట్టిన గతే తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన కరీంనగర్ (Karimngar)లో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర (Maharashtra)లో బీజేపీ (BJP) విజయదుంధుభి మోగించిందని అన్నారు. గతంలో కంటే ఎక్కవ సీట్లను తమ పార్టీ కైవసం చేసుకోబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర (Maharashtra)లో మరోసారి నరేంత్ర మోడీ (Narendra Modi) అభివృద్ధి మంత్రం పని చేసిందని అన్నారు. అక్కడి ప్రభుత్వంపై ఇండియా కూటమి (India Alliance) ఎన్ని అబద్ధపు ప్రచారం చేసినా.. ప్రజలకు నమ్మలేదని, నరేంద్ర మోడీ (Narendra Modi) నాయకత్వాన్ని నమ్మారని అన్నారు.
హస్తం పార్టీ ఓ ఐరన్ లెగ్ పార్టీ అని.. ఆ పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా మునుగుడు ఖాయమని అన్నారు. హిందూ ఐడీయాలజీ (Hindu Ideology) ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన ‘ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే పార్టీ’ ('Uddhav Balasaheb Thackeray Party') హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే పార్టీలతో కుమ్మక్కై అవ్వడం వల్లే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని కామెంట్ చేశారు. తాజాగా, వచ్చిన ఫలితాల్లో మహారాష్ట్ర (Maharashtra) ప్రజల ఐక్యత కనిపించిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ (Congress) ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ (Telangana)లోనూ కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి కూడా ఇదే గతి పట్టబోతోందని బండి సంజయ్ (Bandi Sanjay) కామెంట్ చేశారు.