Bandi Sanjay: ‘చలో సెక్రటేరియట్‌’కు బండి సంజయ్ పిలుపు.. రోడ్లపైకి వచ్చిన గ్రూప్-1 అభ్యర్థులు

గ్రూప్-1 మెయిన్స్‌ను పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ.. గత కొన్ని రోజులుగా అభ్యర్థులు నిరసన బాట పట్టారు.

Update: 2024-10-19 08:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 మెయిన్స్‌ను పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ.. గత కొన్ని రోజులుగా అభ్యర్థులు నిరసన బాట పట్టారు. ఈ క్రమంలోనే నగరంలోని అశోక్ నగర్‌లో పరీక్షను వాయిదా వేయాలని నిరసన వ్యక్తం చేసిన గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అదేవిధంగా కొంతమంది మహిళా అభ్యర్థులను సైతం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అభ్యర్థుల అరెస్ట్‌ను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. తాజాగా, ఆయన కాసేపటి క్రితం గ్రూప్-1 అభ్యర్థులను స్వయంగా కలిసి పరామర్శించేందుకు అశోక్‌నగర్ వెళ్లారు. అనంతరం అయన అక్కడి నుంచి ‘చలో సెక్రటేరియట్‌’కు పిలునిచ్చారు. దీంతో ఒక్కసారిగా గ్రూప్-1 అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. మెయిన్స్ పరీక్షను వెంటనే వాయిదా వేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపైనే బైఠాయించి పరీక్ష రద్దుపై వెంటనే ప్రకటన చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.  


Similar News