హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్: కేంద్ర మంత్రి బండి సంజయ్

Update: 2024-09-30 04:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా పేరుతో తెలంగాణ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్‌ పార్టీ వేల కోట్లు దండుకున్నట్లే ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ కూడా వేలకోట్ల ఆదాయం సంపాదించుకుంటోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని, వారి కోసం ఒంటరిగానే పోరాటం చేస్తుందని చెప్పారు. తమ నాయకుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పేదల పక్షాన నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. అనంతరం తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీసీఎం పదవిని కట్టబెట్టడంపై స్పందిస్తూ.. ఈ తరహా వారసత్వ రాజకీయాలు ప్రజా ప్రభుత్వాలకు మంచిది కాదని, వీటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. చివరిగా కరీంనగర్‌లో విలీన గ్రామాల గురించి మాట్లాడుతూ.. గ్రామాలను విలీనం చేసే ముందు ప్రభుత్వం స్థానికుల అభిప్రాయం తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News