Bandi Sanjay: అగ్నిపథ్ అద్భుతమైనది.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

అగ్నిపథ్ అద్భుతమైనది అని, దీంతో యువతకు ప్రతీ ఏడాది వేల ఉద్యోగాలు వస్తాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

Update: 2024-08-11 11:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:అగ్నిపథ్ అద్భుతమైనది అని, దీంతో యువతకు ప్రతీ ఏడాది వేల ఉద్యోగాలు వస్తాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాళాశాల ఫ్రెషర్స్ డే కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన అగ్నివీర్ ఫథకంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఆర్మీ జవాన్లే కీలమని, వాళ్లే రియల్ హీరోస్ అని అన్నారు. ఎంతో నిబద్దతతో వేలాది మంది విద్యార్ధులను తీర్చిదిద్దుతున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అలాగే దేశం కోసం సేవ చేయాలని మిమ్ముల్ని ఇక్కడికి పంపిన మీ తల్లిదండ్రులు నిజమైన దేశభక్తులని కొనియాడారు. ఇక అగ్నిపథ్ పథకం చాలా అద్భుతమైనదని, దీనిపై లేనిపోనివి చెప్పి విద్యార్ధులు యువతను రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. దీనిపై ఆరోపణలు చేసి యువతను ఆగం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. యువత ఆలోచించాలని, ఈ పథకంతో ప్రతీ ఏడాది వేల ఉద్యోగాలు వస్తాయని, ఎంతోమంది అగ్నివీరులు తయారవుతున్నారని బండి సంజయ్ తెలిపారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..