శ్రీరామనవమి ఎఫెక్ట్: మందు బాబులకు పోలీసుల బిగ్ షాక్
శ్రీరామనవమి పండుగ సందర్భంగా మద్యం ప్రియులకు పోలీసులు షాకిచ్చారు. మార్చి 30వ తేదీన(ఎల్లుండి) జరగబోయే శ్రీ సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీరామనవమి పండుగ సందర్భంగా మద్యం ప్రియులకు పోలీసులు షాకిచ్చారు. మార్చి 30వ తేదీన(ఎల్లుండి) జరగబోయే శ్రీ సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వైన్స్ షాపులకు ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయించితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా, భద్రాచలంలో రాములోరి కల్యాణం కనుల పండువగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సీఎం కేసీఆర్ అందజేస్తారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు.