సస్పెండ్ అయిన ఎస్ఐకి మద్దతుగా బంద్.. గ్రామాల్లో హైటెన్షన్

జగిత్యాల ఆర్టీసీ బస్సులో జరిగిన ఇన్సిడెంట్‌పై పోలీసు ఉన్నతాధికారులు రూరల్ ఎస్సై గా ఉన్న అనీల్‌ను సస్పెండ్ చేస్తూ ఆర్డర్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-05-13 04:33 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల ఆర్టీసీ బస్సులో జరిగిన ఇన్సిడెంట్‌పై పోలీసు ఉన్నతాధికారులు రూరల్ ఎస్సైగా ఉన్న అనీల్‌ను సస్పెండ్ చేస్తూ ఆర్డర్ జారీ చేసిన విషయం తెలిసిందే. సస్పెండ్ అయిన ఎస్ఐకి మద్దతుగా హిందూధార్మిక సంస్థలు పలు వ్యాపార సంఘాలు శనివారం జగిత్యాల బంద్‌కు పిలుపునిచ్చాయి. హిందూ సంఘాల నాయకులు తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు డిపొ వద్ద బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మరికొందరు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఇదిలా ఉండగా జగిత్యాల రూరల్ గ్రామలైన జాబితా పూర్, ధర్మారం గ్రామాల ప్రజలు ఎస్ఐ అనిల్ యాదవ్ సస్పెన్షన్ ఎత్తివేయాలని నిరసిస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ బంద్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని సస్పెండ్ అయిన ఎస్సై అనిల్ వీడియో ద్వారా ఇప్పటికే స్పష్టం చేసారు.

Tags:    

Similar News