హైదరాబాద్, సికింద్రాబాద్‌లో షేరింగ్ ఆటోలపై నిషేధం

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ లో షేర్ ఆటోలపై నిషేధం విధిస్తూ.. నగర ట్రాఫిక్ ఏసీపీ నిర్ణయించారు.

Update: 2023-03-08 05:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ లో షేర్ ఆటోలపై నిషేధం విధిస్తూ.. నగర ట్రాఫిక్ ఏసీపీ నిర్ణయించారు. షేరింగ్ ఆటోలు, ప్యాసింజర్ ఆటోలు అసురక్షిత పద్ధతులు, అలాగే రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ఆటోలు ఆపే విధానం, రోడ్లపై వారి ఇష్టం వచ్చినట్లు ఆటోలను పార్కింగ్ చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిసై సమావేశం నిర్వహించిన ట్రాఫిక్ ఏసీపీ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో షేర్‌ ఆటోలపై నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News