అస్సలు ఊహించరు.. Balapur మొట్టమొదటి లడ్డూ ధరెంతో తెలుసా?

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట శుక్రవారం ఉదయం అట్టహాసంగా జరిగింది. వేలం పాటలో ఈ యేడాది సరికొత్త రికార్డు నమోదు అయింది.

Update: 2022-09-09 07:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట శుక్రవారం ఉదయం అట్టహాసంగా జరిగింది. వేలం పాటలో ఈ యేడాది సరికొత్త రికార్డు నమోదు అయింది. లడ్డూ వేలం ధర రూ. 24.60 లక్షలు పలికింది. బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి ఈ సవంత్సరం బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నాడు. గతేడాది వేలంలో మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18.9 లక్షలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకోగా ఈ సారి అంతకు మించి రూ.5.70 లక్షలు అదనంగా పలికింది. 26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా బాలాపూర్‌ గణేష్‌ లడ్డూవేలం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బాలాపూర్‌ లడ్డూకు పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులు వేలం పాట ప్రారంభించారు. ఈసారి నిర్వహించిన వేలం పాటలో 28 మంది పాల్గొన్నారు. బాలాపూర్‌ గణేషుడి లడ్డూ ప్రతి ఏడాది 21కిలోల బరువుతో తయారు చేస్తారు. బాలాపూర్‌ లడ్డూ సంప్రదాయం 1980లో ప్రారంభమవ్వగా.. వేలం మాత్రం 1994లో ప్రరంభం అయింది. బాలాపూర్ గణేష్ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులతోపాలు ప్రముఖులు సైతం పోటీపడతారు. ఈ యేడాది జరిగిన లడ్డూ వేలం పాట కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, ఇతర రాజకీయ నేతలు పాల్గొన్నారు.

తనకు దక్కుతుందని ఊహించలేదు:

బాలాపూర్ లడ్డూ తనకు దక్కడంపై లక్ష్మారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడు వేలం పాట పాడే తానకు ఈ సారి లడ్డూ దక్కిందన్నారు. 29 ఏళ్లుగా తాను వేలం పాట పాడుతున్నానని చెప్పారు. ఈ సారి లడ్డూ తనకు వస్తుందని ఊహించలేదన్నారు. గతేడిదితో పోల్చితే రూ.5 లక్షలు అధికంగా పలకగా తాను మరో ఐదు లక్షలు పెరిగినా లడ్డూను తానే సొంతం చేసుకోవాలని భావించినట్లు చెప్పారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ లడ్డూను తన బంధుమిత్రులతో పాటు సన్నిహితులకు పంచిపెడతానని చెప్పారు.

1994 నుంచి 2022 వరకు లడ్డు వేలం ఎంతంటే:

బాలాపూర్‌ లడ్డూ వేలం పాట వివరాలు:

1994లో కొలను మోహన్‌రెడ్డి రూ.450

1995లో కొలను మోహన్‌రెడ్డి రూ.4,500

1996లో కొలను కృష్ణారెడ్డి రూ.18,000

1997లో కొలను కృష్ణారెడ్డి రూ. 28,000

1998లో కొలను మోహన్‌రెడ్డి రూ.51,000

1999లో కల్లెం ప్రతాప్‌రెడ్డి రూ.65,000

2000లో కల్లెం అంజిరెడ్డి రూ.66,000

2001లో రఘునందన్‌చారి రూ.85,000

2002లో కందాడ మాధవరెడ్డి రూ.1,05,000

2003లో చిగిరింత బాల్‌రెడ్డి రూ.1,55,000

2004లో కొలను మోహన్‌రెడ్డి రూ.2,01,000

2005లో ఇబ్రహీం శేఖర్‌ రూ.2,80,000

2006లో చిగిరింత శేఖర్‌రెడ్డి రూ.3,00,000

2007లో రఘునందర్‌చారి రూ.4,15,000

2008లో కొలను మోహన్‌రెడ్డి రూ.5,07,000

2009లో సరిత రూ.5,15,000

2010లో కొడాలి శ్రీధర్‌బాబు రూ.5,25,000

2011లో కొలను బ్రదర్స్‌ రూ.5,45,000

2012లో పన్నాల గోవర్థన్‌రెడ్డి రూ.7,50,000

2013లో తీగల కృష్ణారెడ్డి రూ.9,26,000

2014లో సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి రూ.9,50,000

2015లో కొలను మదన్‌ మోహన్‌రెడ్డి రూ.10,32,000

2016లో స్కైలాబ్‌రెడ్డి రూ.14,65,000

2017లో నాగం తిరుపతిరెడ్డి రూ.15,60,000

2018లో శ్రీనివాస్‌గుప్తా రూ.16,60,000

2019లో కొలను రామిరెడ్డి రూ.17,60,000

2020 కరోనా వల్ల వేలం పాట పాడలేదు.

2021లో మర్రి శశాంక్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18,90,000

2022 లో వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60,౦౦౦

ఇవి కూడా చ‌ద‌వండి :  మరోసారి రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డూ.. ఎంత పలికిందో తెలుసా? 

Tags:    

Similar News