సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని

ప్రముఖ నటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) తెలంగాణ వరద బాధితుల సహాయార్థం రూ.50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-13 10:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) తెలంగాణ వరద బాధితుల సహాయార్థం రూ.50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ చెక్కును బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని(Tejaswini Nandamuri) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అందజేశారు. శుక్రవారం ఆమె హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి బాలకృష్ణ తరపున అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన రూ.50 లక్షలను గురువారం బాలకృష్ణ చంద్రబాబుకు అందజేసిన విషయం తెలిసిందే.

కాగా, గత రెండు వారాల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా తెలంగాణలోని ఖమ్మం, ఏపీలో విజయవాడ ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. చాలా ఇళ్లు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఇంట్లోని సామాన్లు కూడా వరదల్లో మునిగిపోయాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ తోచిన సహాయం చేశారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షల చొప్పున రూ.కోటి ప్రకటించారు. ఈ సాయాన్ని ఇవాళ ఆయన కూతురు సీఎంకు అందించారు.

 


Similar News