ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-10-01 16:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన సీనియర్ పోలీస్ అధికారి తిరుపతన్నకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఈ కేసులో తిరుపతన్న దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్ట్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు బెయిల్ మంజూరు చేయడం కుదరని తేల్చి చెప్పింది. తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో.. ఇప్పుడు బెయిల్ ఇస్తే అది దర్యాప్తు మీద ప్రభావం చూపిస్తుందని అభిప్రాయ పడిన కోర్ట్.. తిరుపతన్న బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. మరవైపు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొటరీ ఇచ్చిన నివేదిక ప్రకారం దర్యాప్తు జరపాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.


Similar News