చేనేత కళాకారులకు అవార్డులు.. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు గడువు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం - 2023 సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులను ప్రదానం
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం - 2023 సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులను ప్రదానం చేయుటకు చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. చేనేత, జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ పి. వెంకటేశం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన చేనేత కళాకారుల దరఖాస్తు చేసుకోవాలంటే.. 30 ఏళ్లు నిండి పదేళ్ల అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. చేనేత డిజైనర్ల పోటీకి 25 ఏళ్లు నిండి పని అనుభవం ఉండాలని వెల్లడించారు. దరఖాస్తులు ఏప్రిల్15 లోగా ఆయా జిల్లా చేనేత, జౌళి సహాయ సంచాలకులకు సమర్పించాలని, మిగతా వివరాలకు www.handtex.telangana.gov.inను సంప్రదించాలని సూచించారు.
Also Read...
'గర్భిణీలకు మెయిన్స్ అవకాశం ఇవ్వాలి.. లేదంటే డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం'