కూలీల ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరి పరిస్థితి విషమం
కూలీల ఆటోను కారు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది కూలీలు చెల్లచెదురుగా పడిపోయారు.
దిశ, శాయంపేట(పరకాల): హన్మకొండ జిల్లా, పరకాల పట్టణంలోని చలి వాగు వద్ద ఉదయం ఆరున్నర గంటలకు కూలీల ఆటోను కారు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది కూలీలు చెల్లచెదరుగా పడిపోయారు. అందులో ఇద్దరు కూలీలు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. కూలీలు శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన వారీగా తెలుస్తుంది. పత్తిపాక నుండి రేగొండ మండలంలోని పోచపల్లి గ్రామానికి కూలికి వెళ్తుండగా భూపాల పల్లి నుండి హన్మకొండకు వెళ్లే కారు ఢీకొనడంతో అటో బోల్తా పడినట్లు తెలిసింది. క్షతగాత్రులను పరకాల పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.