BRS నాయకురాలు ఉషా దాసరి తండ్రిపై హత్యాయత్నం

తన తండ్రి దాసరి హనుమయ్య పై బీజేపీ కార్పొరేటర్(BJP corporator) ధీరజ్ రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నాయకురాలు ఉషా దాసరి ఆరోపించారు.

Update: 2024-12-08 12:55 GMT

దిశ, వెబ్ డెస్క్; తన తండ్రి దాసరి హనుమయ్య పై బీజేపీ కార్పొరేటర్(BJP corporator) ధీరజ్ రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నాయకురాలు ఉషా దాసరి ఆరోపించారు. ధీరజ్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆర్కే పురం బీజేపీ ఆఫీస్ లోనే ఈ దారుణానికి ఒడిగట్టారని మీడియా ముఖంగా వెల్లడించారు. ధీరజ్ రెడ్డి తన తండ్రికి డబ్బులు బాకీ ఉన్నాడని, ఆ డబ్బులు అడిగినందుకే ఇలా చేశారన్నారు. ఆ డబ్బులు ఇస్తానని చేప్పి బీజేపీ ఆఫీసుకు పిలిపించుకొని దాడి చేశారని ఉషా దాసరి అన్నారు. ప్రాణ భయంతో చంపవద్దని కాళ్లపై పడి ప్రాధేయపడితే, డబ్బులు అడిగితే చంపుతానని బెదిరించి వదిలేశాడని తెలిపారు. ధీరజ్ రెడ్డి చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ..వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన తండ్రిని ఆ పరిస్థితిలో చూసి ఉషా దాసరి కంట తడి పెట్టుకున్నారు.

Tags:    

Similar News