రామగుండంలో కలకలం.. క్షుద్రపూజల పేరుతో దాడులు

దిశ,గోదావరిఖని: రామగుండంలో ఒక్క సారిగా క్షుద్రపూజల పేరుతో కలకలం సృ

Update: 2022-03-16 04:03 GMT

దిశ,గోదావరిఖని :రామగుండంలో ఒక్క సారిగా క్షుద్రపూజల పేరుతో కలకలం రేగుతోంది.. రెండు వర్గాల మధ్య ఘర్షణ వివాదాస్పదంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే... రామగుండంకు చెందిన ఓ వృద్ధుడు రాముని గుండాల వద్దకు వచ్చే భక్తులకు బొట్టు పెట్టి అక్కడే ఉండి జీవనోపాధి పొందుతున్నాడు. అయితే ఇదే క్రమంలో గోదావరిఖని 5వ ఇంక్లైన్ కు చెందిన ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించడానికి సదురు వృద్ధుడిని ఒప్పుకోవాలని అడగడంతో దీనికి నిరాకరించాడని ఇది మనసులో పెట్టుకున్న సదురు వ్యక్తి సోమన్ పల్లికి ఓ వ్యక్తిపై కొంతమందితో దాడి చేయించినట్లు సమాచారం.అంతే కాకుండా సదరు వ్యక్తి ఒక్క వర్గంతో బెదిరింపులకు సైతం గురిచేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరిఖని 5వ ఇంక్లైన్ కు చెందిన సదరు వ్యక్తిపై గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మూడ నమ్మకాల పేరుతో ప్రజల నుండి అందినకాడికి దండుకుంటాడనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అయితే సదురు వ్యక్తికి రాముని గుండాల వద్ద ఏం పని.. ఎందుకు అక్కడికి వెళ్లి ఘర్షణలు సృష్టిస్తున్నాడు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సదురు వ్యక్తి ఓ వర్గంతో దాడి చేయించాడనే ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రామగుండంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రాముడు కొండ వద్దకు చేరుకొని పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News