దారుణం.. కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపిన భర్త
అనుమానంతో కట్టుకున్న భార్యని కిరాతకంగా చంపిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దిశ, మియాపూర్ : అనుమానంతో కట్టుకున్న భార్యని రాయితో మోది ఆపై అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ సీఐ క్యాస్త్రో తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో తాండూరుకు చెందిన అంబిక(27) నరేందర్‌లు నివాసం ఉంటున్నారు. స్థానికంగా అంబిక శ్వాస బొటిక్ షాపులో పనిచేస్తుంది. శుక్రవారం ఉదయం 11.40 సమయంలో షాప్ లో పనిచేస్తున్న సమయంలో అంబిక వద్దకు తన భర్త నరేందర్ వచ్చి బండరాయితో తలపై మొదాడు. ఈ క్రమంలో తేరుకున్న అంబిక తప్పించుకునేందుకు పరిగెత్తడంతో వెంటపడి కత్తితో అతి దారుణంగా మెడపై నరికి హత్య చేశాడు. భార్యను చంపిన భర్త పోలీసులకు లొంగిపోయాడు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.