Assembly: మేం బీఆర్ఎస్ వాళ్ల లాగా ఆస్తులు అమ్ముకోం.. సభలో డిప్యూటీ సీఎం భట్టి

తాము బీఆర్ఎస్(BRS) వాళ్ల లాగా ఆస్తులు అమ్ముకోలేదని డిప్యూటీ సీం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-17 06:30 GMT

దిశ, వెబ్ డెస్క్: తాము బీఆర్ఎస్(BRS) వాళ్ల లాగా ఆస్తులు అమ్ముకోలేదని డిప్యూటీ సీం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) రసబాసగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. సభలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు అప్పులపై అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇస్తూ.. హాట్ కామెంట్స్ చేశారు. అలాగే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ దాటి అప్పులు చేస్తున్నారని అడిగిన దానికి భట్టి విక్రమార్క సమాధానం ఇస్తూ.. అప్పులలో ఇంత వరకు ఎక్కడ కూడా ఎఫ్ఆర్బీఎం(FRBM) లిమిట్స్ క్రాస్ చేయలేదని, భవిష్యత్ లో చెయ్యమని కూడా చెప్పారు.

గత ప్రభుత్వ అప్పుకు వడ్డీ చెల్లించాలని కొంత అప్పు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టడం కానీ, అమ్ముకోవడం కానీ చేయకుడదని, ప్రభుత్వ భూముల్ని ప్రజా శ్రేయస్సు కొరకే వాడుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ల లాగా ఆస్తులు అమ్ముకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government) హయాంలో సంపాదించిన ఔటర్ రింగ్ రోడ్డును(Outer Ring Road) 30 ఏళ్లకు అమ్ముకున్నారని, 30 సంవత్సరాలు మీరు పన్నూలు వసూలు చేసుకోండి.. ఆ డబ్బు మాకు ముందే కట్టేసి వెళ్లిపోండి అని ఓఆర్ఆర్(ORR) ను ఎవరికో లీజుకు ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తుల్ని ముందే లీజుకు ఇచ్చి ముందే డబ్బు తీసుకుంటే రాబోయే ప్రభుత్వాలు పాలన చేస్తాయని, అది అర్థవంతమైన ఆలోచనేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విధంగా మా ప్రభుత్వం చేయాలనుకోవడం లేదని, చేయదు కూడా అని భట్టి స్పష్టం చేశారు.

Tags:    

Similar News