దమ్ముంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలి: MP Arvind ఛాలెంజ్
సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని తక్షణమే రద్దు చేయాలని బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అరవింద్ ఛాలెంజ్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని తక్షణమే రద్దు చేయాలని బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అరవింద్ ఛాలెంజ్ చేశారు. టీ- బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన సందర్భంగా నిర్మల్ జిల్లాలోని భైంసాలో భారీ బహిరంగా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎంపీ అరవింద్ పాల్గొని మాట్లాడారు. దమ్ముంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలని.. అసెంబ్లీని రద్దు చేసిన మరుక్షణమే తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తుందని అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు గవర్నర్ కూడా రెడీగా ఉన్నారని తెలిపారు.