Assembly: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

హైదరాబాద్ లో త్వరలోనే మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Update: 2024-08-02 08:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో త్వరలోనే మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్న బేగర్ కంచె ప్రాంతానికి నేషనల్ అకాడమీ కన్ స్ట్రక్షన్ కూడా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీంతో పాటు దాని పక్కనే అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వం స్తలం కేటాయిస్తుందని, దీని కోసం బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తి అయ్యాయని అన్నారు. ఈ ప్రతిపాధనకు బీసీసీఐ కూడా సుముఖత వ్యక్తం చేసిందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగనుందని అన్నారు.

రాష్ట్రంలోని యువతను వ్యసనాల నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం స్పోర్ట్స్ కి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిందని, దీనికి ప్రతిపక్షాలు ఏ సలహా ఇచ్చిన తీసుకొని ముందుకు వెళతామని సీఎం స్పష్టం చేశారు. ఇక అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్పోర్ట్స్ పాలసీపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నడు లేని విధంగా 361 కోట్ల రూపాయలను స్పోర్ట్స్ కోసం కేటాయించడం జరిగిందన్నారు. క్రీడలను ప్రోత్సహించాలని నికత్ జరీన్, మహ్మద్ సిరాజ్ లకు ఇళ్ల స్థలాలతో పాటు గ్రూప్1 ఉద్యోగాలు కేటాయించామని తెలిపారు. తెలంగాణలో త్వరలో ఓ స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దాని కోసం ఇతర రాష్ట్రాలలో ఉన్న స్పోర్ట్స్ పాలసీలను పరీశీలిస్తున్నామని, స్పోర్స్ట్ పాలసీని వచ్చే సెషన్ లో చర్చ జరిపి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అలాగే మండలాల్లో మినీ స్టేడియంలు నిర్మించడానికి కూడా ప్రభుత్వం యోచన చేస్తోందని చెప్పారు. 

Tags:    

Similar News