TG ASSEMBLY: ద్రవ్యవినియమ బిల్లుకు శాసనసభ ఆమోదం
ద్రవ్యవినియమ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఇవాళ సభలో ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిగింది. అనంతరం సభలో గందరగోళం ఏర్పడగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన, నిరసనల మధ్యే ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను రేపటికి వాయిదా వేశారు. కాగా ఈరోజు ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరింగింది. సబితా ఇంద్రారెడ్డికి ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగగా ప్రతిపక్ష సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.