కారుజోరుకు కమలం ఢమాల్.. అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కారుజోరుకు కమలం ఢమాల్ అని, యూపీ ఎన్నికల ఫలితాలు తెలంగాణకు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కారుజోరుకు కమలం ఢమాల్ అని, యూపీ ఎన్నికల ఫలితాలు తెలంగాణకు వర్తించవని ఎంపీ అసదుద్దీన్ ఓవైస్ స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్లే బీజేపీ గెలుస్తుందన్నారు. యూపీ ఎన్నికలపై నారాజ్ లేదని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే మేం సిద్ధమన్నారు. ఇంటి విషయంలో అక్బరుద్దీన్ చూసుకుంటాడు.. పార్టీని నేను చూసుకుంటున్నానని వెల్లడించారు. యూపీలో పోటీ చేస్తే హత్యాయత్నం జరిగిందని, అయినా భయడపలేదన్నారు. ఎన్నికలు అన్నప్పుడు గెలుపు ఓటములు సహజం అని పేర్కొన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ కూడా మంచి జోష్ లో ఉన్నారని, యూపీ ఎన్నికల ఫార్ములా ఇక్కడ పని చేయదని స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్థాన్ లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామన్నారు. కాన్షి రాం స్ఫూర్తి తో పని చేస్తామని స్పష్టం చేశారు. పోటీ చేయడం..ఓడించడం.. గెలవడమే మా పాలసీ అన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీన పడుతుందని, గులాం నబీ ఆజాద్ కి క్వార్టర్ పొడిగింపునకు మోడీ ఆఫీస్ నుండి ఆదేశాలు వెనక మతలబు ఏంటి..? అని ప్రశ్నించారు. తెలంగాణ లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది ఇప్పుడు చెప్పలేం...ఎన్నికలు వచ్చాక చెప్తామని స్పష్టం చేశారు. ఆజాద్ రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టిన.. మాకు శత్రువు బీజేపీ అని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ..తెలంగాణ, ఒరిస్సా మద్దతు తప్పనిసరి అని అన్నారు. నియోజక వర్గాల పునర్విభజన మరో ఉద్యమం కి కారణం అవుతుందని, జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల విభజన జరిగితే దక్షిణ భారత దేశం నష్టపోతుందన్నారు. దక్షిణాదిన జనాభా నియంత్రణ ఎక్కువ... ఉత్తర భారతం లో నియంత్రణ ఉండదన్నారు.