అమిత్ షాకు అసదుద్దీన్ ఓవైసీ లేఖ.. డిమాండ్ ఇదే
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్లకు లేఖలు రాశారు.
దిశ, వెబ్డెస్క్: సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్లకు లేఖలు రాశారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు అని.. తెలంగాణ విమోచనం కోసం హిందువులు, ముస్లింలు పోరాడారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగయాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు అంతా పాల్గొంటారని.. ఈ సభకు సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ సిద్ధమవుతుండగా.. విలీన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది.