మంత్రి కేటీఆర్‌తో అసదుద్దీన్ ఒవైసీ భేటీ
తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం అంసెబ్లీలో వీరిద్ధరూ సమావేశం అయ్యారు. అయితే ఐదు రోజుల క్రితం అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్‌కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వం తీరుపై అక్బరుద్దీన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఈసారి 50 స్థానాల్లో పోటీ చేసి 15 సీట్లను తప్పకుండా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతామని ఛాలెంజ్ విసిరారు. ఆ తర్వాత మూడు రోజుల క్రితం అక్బరుద్దీన్ ఒవైసీ అనూహ్యంగా సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబుతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. దీంతో అసెంబ్లీ వేదికగా రాబోయే ఎన్నికల ముంగిట్లో కొత్త పొత్తులు పొడుస్తాయా అనే చర్చ జరిగింది. ఇంతలోనే అక్బరుద్దీన్ సోదరుడు ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేటీఆర్‌ను కలవడంతో ఈ భేటీకి రీజన్ ఏంటనే చర్చ జోరందుకుంది.
Also Read..