కేసీఆర్​తో కలుస్తాం.. ఓవైసీ కీలక ప్రకటన

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ముస్లింలతో పాటు హిందువులు, జైనుల, ఇతరుల సంక్షేమం కోసం సైతం

Update: 2022-03-12 14:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ముస్లింలతో పాటు హిందువులు, జైనుల, ఇతరుల సంక్షేమం కోసం సైతం పోరాడుతామని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ఓవైసీ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన విద్య, వైద్యం అంశాలతో పాటు పది డిమాండ్లను లేవనెత్తారు. పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు-మనబడి, మన బస్తీ-మనబడిలో పొందుపరిచిన మౌలిక సదుపాయాలన్నీ గత బడ్జెట్ లో ప్రస్తావించనవే అని, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినవి ఏమీ లేవని ఆయన తెలిపారు. మన ఊరు-మనబడిని విడతల వారీగా కాకుండా అన్ని ఏకకాలంలో అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ ​చేశారు. హైదరాబాద్​లోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. ప్రైవేట్​ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరుదామనుకున్న విద్యార్థులకు ప్రైవేట్​యాజమాన్యాలు టీసీ ఇవ్వట్లేదని, టీసీ లేకుండానే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకునేలా తీసుకోవాలనే డిమాండ్​ను అక్బరుద్దీన్ లేవనెత్తారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఖాళీల భర్తీపై అక్బరుద్దీన్ ​ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ​ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి అందులో ఏయే శాఖకు చెందినవారున్నారో క్లారిటీ ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఉన్న రెసిడెన్షియల్ ​స్కూళ్లను అప్​గ్రేడ్​ చేయాలని అక్బరుద్దీన్​ డిమాండ్​ చేశారు. విద్యాశాఖలో 95 శాతం మంది ఎంఈవోలు ఇన్ చార్జీలేనని, అందులో కొందరు 7, 8 మండలాలు పర్యవేక్షిస్తే, కొందరు 5, ఇంకొందరు 3, 4 మండలాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. డీఈవోలు కూడా ఏడుగురు మాత్రమే ఉన్నట్లుగా తెలిపారు.

ఉర్దూ మీడియం పోస్టులకు ప్రత్యేకంగా డీఎస్సీ నిర్వహించాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ ​చేశారు. పలు కోర్సుల్లో ఉర్దూ మీడియానికి సంబంధించి పోస్టులు నేటికీ భర్తీ చేయలేదని, ఖాళీలను భర్తీ చేయకుండా ఖతం పట్టిస్తున్నారని సభలో తెలిపారు. ఉర్దూ మీడియంలో 69 లెక్చరర్​ పోస్టుల రెగ్యులరైజేషన్​కు సంబంధించిన ఫైల్ ను పెండింగ్​లో పెట్టారన్నారు. అన్ని రకాల కాంపిటేటివ్ ​పరీక్షలతో పాటు ఎంసెట్​ను కూడా ఉర్దూలో కూడా నిర్వహించాలని డిమాండ్​ చేశారు. ఈ విషయాలపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి తమతో ప్రత్యేక మీటింగ్​ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా టెట్​ నిర్వహించలేదని, లక్షల మంది ఎదురుచూస్తున్నారన్నారు. ఇటీవల యూనివర్సిటీలకు నియమించినీ వీసీల్లో ముస్లింలకు ప్రాధాన్యం కల్పించకపోవడంపై ఫైరయ్యారు. ఐఐటీ బాసరకు వీసీ లేడని, అక్కడ విద్యార్థులకు భోజనం సరిగ్గా అందించట్లేదని, ఫుడ్​లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు తనకు ఫోన్​చేస్తున్నారని ప్రస్తావించారు. తమ సమస్యలపై సభలో మాట్లాడాలని విద్యార్థులు ప్రశ్నించాలని కోరారని ఆయన వెల్లడించారు.

ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది వక్ఫ్​భూముల్లోనేనని ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ పేర్కొన్నారు. అయితే ముస్లింల కాలనీలకు వెళ్లే రోడ్లు, మజీద్, ఖబర్​స్తాన్​కు వెళ్లే దారులన్నీ మూసేశారని, వాటిని తెరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపేట మార్కెట్​కు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చినా సర్కార్​కూలగొట్టిందని, దీంతో నిరుపేదల బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. రోడ్లపై అమ్ముకుందామంటే పోలీసులు చలాన్లు వేస్తున్నారన్నారు. వ్యాపారుల ఇబ్బందులు తొలగించేందుకు అవసరమైతే 30 ఎకరాల వక్ఫ్​బోర్డు భూములిస్తామని, కొత్త మార్కెట్​ఏర్పాటయ్యే వరకు వారికి అందులో టెంపరరీగా ఏర్పాట్లు చేయాలని సభలో తెలిపారు. కొవిడ్​సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వైద్య సిబ్బంది కాంట్రాక్ట్​పీరియడ్​ఈ నెల 31తో ముగుస్తుందని, వారిని రెగ్యులరైజ్​చేయాలని మంత్రి హరీశ్​రావును కోరారు. దీనికి స్పందించిన హరీశ్​రావు వైద్య సిబ్బందిని ఒక ఏడాది పాటు కాంట్రాక్ట్​బేసిక్​లో తీసుకున్నట్లు చెప్పారు. ఆ వైద్య సిబ్బందిని వెయిటేజీ ఆధారంగా క్రమంగా పర్మినెంట్​చేస్తామని బదులిచ్చారు. పాత బస్తీకి ఒక స్పోర్స్ట్​స్కూల్​ఏర్పాటు చేయాలని, ఒకవేళ స్థలం లేకుంటే మహేశ్వరంలో అయినా ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్​డిమాండ్​చేశారు. అలాగే జీహెచ్ఎంసీ అభివృద్ధికి బడ్జెట్​కేటాయించలేదని, త్వరగా మంజూరు చేయాలన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు తాము కూడా కలిసి నడుస్తామని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని అక్బరుద్దీన్​స్పష్టం చేశారు

Tags:    

Similar News