సమ్మె విరమణపై ఆర్టిజన్స్ కీలక నిర్ణయం
విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజెన్లు బ్యాక్ స్టెప్ వేశారు. సమ్మెను విరమణ చేస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బుధవారం ప్రకటించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజెన్లు బ్యాక్ స్టెప్ వేశారు. సమ్మెను విరమణ చేస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బుధవారం ప్రకటించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల హామీ మేరకు సీఎండీ ప్రభాకర్ రావుతో వారు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్(H82) ప్రధాన కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. చర్చల్లో భాగంగా బేషరతుగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
సమ్మెలో ఉన్న ఆర్టిజెన్స్ తక్షణమే విధుల్లోకి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా తొలగించిన 200 మంది ఆర్టిజన్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారని ఆయన స్పష్టంచేశారు. తొలగించిన వారిని 10 రోజుల్లో విధుల్లోకి తీసుకుంటుమాని ప్రభాకర్ రావు హామీ ఇచ్చారని సాయిలు వెల్లడించారు.