CS Shanti Kumari : గ్రూప్ -3 పరీక్షలకు పడక్బంది ఏర్పాట్లు : సీఎస్ శాంతి కుమారి
గ్రూప్ -3 పరీక్షల(Group-3 exams( ను పకడ్బందిగా నిర్వహిచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari)తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రూప్ -3 పరీక్షల(Group-3 exams ) ను పకడ్బందిగా నిర్వహిచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari)తెలిపారు. అభ్యర్థులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా, ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈనెల 17, 18 తేదీల్లో జరిగే పరీక్ష కు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరకాస్తు చేశారని ఆమె తెలిపారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రూప్ -3 పరీక్ష నిర్వహణ, ధాన్యం, పత్తి కొనుగోళ్లు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కొత్తగా మంజూరైన నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలపై ఏర్పాట్లపై సమీక్షించారు. గ్రూప్ -3 అభ్యర్థుల కోస 1401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్ లు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించాని, ఎక్కడా ఎలాంటి అసౌకర్య, లోపాలు ఉండోద్దన్నారు. పరీక్షకు 2 రోజుల ముందు మరో సారి స్ట్రాంగ్ రూమ్ లు సందర్శించాలని, రవాణా సౌకర్యం, తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఈ సందర్భంగా టీజీపీఎస్ సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షను పారదర్శకంగా నిర్వహించేదుకు అన్ని రకాల సూచనలను టీజీపీఎస్సీ జారీ చేసిందన్నారు. వాటిని పాటించాలని ఆయన సూచించారు. ధాన్యం దిగుబడి బాగా వచ్చిందని, ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఆమె సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా వేగంగా జరిగే విధంగా చూడాలన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘనందన్ రావు, పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.