Street Dogs: మీ ఏరియాలో కుక్కలు దాడి చేస్తున్నాయా.. అయితే, ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కు ఫోన్ చేయండి

వీధి కుక్కల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది

Update: 2024-07-26 12:42 GMT

దిశ, ఫీచర్స్: ఒకప్పుడు కుక్కలను ఇంట్లో సంతోషంగా పెంచుకునే వాళ్ళు కానీ, ఇప్పుడు చాలా భయపడుతున్నారు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మనుషుల మీద దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలని అయితే భయంకరంగా కరుస్తున్నాయి. ఈ దాడుల్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు.

ఒక రాష్ట్రం అని లేదు, ఒక జిల్లా అని లేదు ఎక్కడా చూసిన వీధి కుక్కల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. జీహెచ్ఎంసీలో అయితే బాగా ఎక్కువైపోయాయి. జవహర్ నగర్, ఇస్నాపూర్ లో రెండు, మూడేళ్ళ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వీధి కుక్కల దాడులను అడ్డుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని కొన్ని సార్లు హైకోర్టు సీరియస్ అయింది. ఇక జీహెచ్ఎంసీ ఆఫీసర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మీరు నివసించే ఏరియాలో కుక్కలు ఉంటే వారికి వెంటనే సమాచారాన్ని అందివ్వాలని టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించారు.

టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు పోస్ట్ ద్వారా తెలిపారు. మీరు ఫిర్యాదు చేసిన వెంటనే జీహెచ్ఎంసీ డాగ్ క్యాచింగ్ సిబ్బంది వచ్చి ఆ ఏరియాలోని కుక్కలను పట్టుకుంటామని తెలిపారు. ఒక్క ఫోన్ కాల్ తో మీ సమస్యను సులభంగా పరిష్కరించుకోండిని జీహెచ్ఎంసీ వెల్లడించింది.


Similar News