ఖమ్మం సభ కో ఆర్డినేటర్ల నియామకం
తెలంగాణలో రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఓ వైపు ఖమ్మం సభపై ఫోకస్ పెట్టిన పార్టీ నేతలు మరో వైపు సోషల్ మీడియాలో పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఓ వైపు ఖమ్మం సభపై ఫోకస్ పెట్టిన పార్టీ నేతలు మరో వైపు సోషల్ మీడియాలో పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 2వ తేదీన ఖమ్మంలో జరగబోయే తెలంగాణ ‘జన గర్జన మీటింగ్’ కోసం నియోజకవర్గ కోఆర్టినేటర్లను నియమించింది.
ఈ మేరకు శుక్రవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మరోవైపు సోషల్ మీడియా విభాగానికి అసెంబ్లీ సమన్వయకర్తలు మరియు కో-ఆర్డినేటర్లు, మండల మరియు మునిసిపాలిటీ కోఆర్డినేటర్ల నియామకాలను చేపట్టింది. ఈ మేరకు ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ వెల్లడించారు.
Also Read..
Revanth Reddy: ఖమ్మంలో పదికి పది సీట్లు.. కాంగ్రెస్ గెలుపు ఖాయం..